పులివెందుల జేఎన్టీయూ కళాశాల ఈసీఈ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ వరలక్ష్మికి చెన్నై వేల్స్ యూనివర్సిటీ డాక్టరేట్ ప్రదానం చేసింది. మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ పద్ధతుల ద్వారా ఊపిరితిత్తులపై మల్టీ వైరస్ ఇన్ఫెక్షన్ గుర్తింపు అంశంపై ఆమె చేసిన పరిశోధనకు ఈ గుర్తింపు లభించింది. వరలక్ష్మి సాధించిన ఈ విజయానికి తోటి అధ్యాపకులు,
విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు.