లింగాల మండలంలోని గుణకనపల్లి, రామట్లపల్లి, చిన్నకుడాల, మురారిచింతల గ్రామాల్లో గురువారం రాత్రి వీచిన బలమైన గాలులకు వందల ఎకరాల్లోని అరటి పంటలు నేలమట్టమయ్యాయి. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. అధికారులు వెంటనే పంట నష్టాన్ని పరిశీలించి, ప్రాథమిక అంచనాలు తయారు చేసి ప్రభుత్వానికి నివేదికలు పంపాలని, నష్టపోయిన రైతులకు ఆర్థిక సహాయం అందించాలని రైతులు కోరుతున్నారు.