ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) ఒక వరమని ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామగోపాల్రెడ్డి పేర్కొన్నారు. బుధవారం ఆయన పులివెందుల నియోజకవర్గ పరిధిలోని 17 మంది లబ్ధిదారులకు రూ. 14,59,279 విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను తన నివాసంలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ, పేద ప్రజల ఆరోగ్య భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు.