పులివెందుల ప్రభుత్వ మెడికల్ కళాశాలకు కేటాయించిన పరికరాలను మంగళవారం గుంటూరు ప్రభుత్వ వైద్య కళాశాలకు తరలించారు. డీఎంఈ కార్యాలయ ఉత్తర్వుల మేరకు ఈ తరలింపు జరిగిందని ఆసుపత్రి సూపరింటెండెంట్ శ్రీనివాస్ తెలిపారు. ఆసుపత్రికి అవసరమైన కొన్ని పరికరాలను ఇక్కడే ఉంచి, మిగిలిన వాటిని తరలించినట్లు ఆయన పేర్కొన్నారు.