ఫిబ్రవరి 1న సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో మాజీ మంత్రి అంబటి రాంబాబు కడప జిల్లా వేంపల్లి పోలీస్ స్టేషన్లో సీఐ నరసింహులు ఎదుట విచారణకు హాజరయ్యారు.
తెదేపా మండల కన్వీనర్ రామమునిరెడ్డి ఫిర్యాదు మేరకు పోలీసులు అంబటిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. విచారణ అనంతరం ఆయన పులివెందుల బయలుదేరారు.