కడుపు నొప్పి తాళలేక బాలిక బలవన్మరణం

8చూసినవారు
కడుపు నొప్పి తాళలేక బాలిక బలవన్మరణం
వేంపల్లెలోని ఓ కాలనీకి చెందిన ఓ బాలిక (17) ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు మంగళవారం తెలిపారు. ఇటీవలే ఆ బాలిక ఇంటర్మీడియట్ పూర్తి చేయగా గత కొద్ది కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఉండేది. ఇటీవల కడుపు నొప్పి రావడంతో కుటుంబసభ్యులు ఆసుపత్రిలో చూపించారు. ఈ క్రమంలో మంగళవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యానుకు చీరతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

సంబంధిత పోస్ట్