వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీశ్‌రెడ్డి బుధవారం పులివెందులలో మాట్లాడుతూ, చంద్రబాబు అధికారంలోకి రావడానికి సూపర్-6తోపాటు అనేక హామీలు ఇచ్చారని, కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని తుంగలో తొక్కారని విమర్శించారు. ప్రతిరోజు వైఎస్
జగన్ నామస్మరణ చేయకపోతే నిద్ర పట్టడంలేదని ఆయన ఎద్దేవా చేశారు.
టీడీపీ మేనిఫెస్టోను రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ప్రతి ఇంటికి తీసుకెళ్తామని తెలిపారు.