బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా పులివెందులలో మంగళవారం ఉదయం నుంచి చిరుజల్లులతో కూడిన వర్షం కురుస్తోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావడం లేదు. కార్తీక మాసంలో వరుస అల్పపీడనాల ప్రభావంతో కురుస్తున్న వర్షాలు శివాలయాల వద్ద జలకళను సంతరించుకునేలా చేశాయి.