పులివెందులలో చిరుజల్లులతో కూడిన వర్షం

3762చూసినవారు
పులివెందుల పట్టణంలో మంగళవారం ఉదయం చిరుజల్లులతో కూడిన వర్షం కురిసింది. ఈ వర్షం కారణంగా వాతావరణం ఒక్కసారిగా చల్లబడటంతో పట్టణంలోని పురవీధులు చిత్తడిగా మారాయి. ఉదయాన్నే వర్షం ప్రారంభం కావడంతో వాహనదారులు, చిరు వ్యాపారులు కాస్త ఇబ్బంది పడ్డారు. పులివెందుల పట్టణంతోపాటు పలు గ్రామాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది.

సంబంధిత పోస్ట్