లింగాల మండలం అంబకపల్లి సమీపంలో మంగళవారం ఒక బోలెరో వాహనం విద్యుత్ స్తంభాన్ని ఢీకొని బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు అతన్ని 108 అంబులెన్స్ ద్వారా పులివెందుల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడిని ముదిగుబ్బకు చెందిన పవన్‌గా గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.