పులివెందుల మున్సిపాలిటీ పరిధిలోని పెద్ద రంగాపురంలో మంగళవారం మున్సిపల్
వైసీపీ ఇన్ఛార్జ్ వైఎస్ మనోహర్ రెడ్డి పర్యటించారు. ఆయన
వైసీపీ నాయకులతో కలిసి ప్రజల సమస్యలను తెలుసుకుని, వాటిని తక్షణమే పరిష్కరించాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ ఛైర్మన్ వరప్రసాద్ కూడా పాల్గొన్నారు. అధికారులు ఎలాంటి సమస్యలు లేకుండా ప్రజలకు సేవ చేయాలని ఆయన కోరారు.