వేంపల్లెలోని తిరుమల థియేటర్‌లో పెద్ద సినిమా విడుదల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు, గొడవలు జరగకుండా పోలీసులు ప్రత్యేక బందోబస్త్ నిర్వహించారు. ప్రేక్షకుల రద్దీని దృష్టిలో ఉంచుకుని థియేటర్ పరిసరాల్లో భద్రతా చర్యలను కట్టుదిట్టం చేశారు. ఎస్ఐలు తిరుపాల్ నాయక్, తాహిర్ హుస్సేన్ ఆధ్వర్యంలో పోలీసులు పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ శాంతిభద్రతలు కాపాడేందుకు చర్యలు చేపట్టారు.