అక్రమ అరెస్టులకు వ్యతిరేకంగా వేంపల్లిలో నిరసన

6చూసినవారు
అక్రమ అరెస్టులకు వ్యతిరేకంగా వేంపల్లిలో నిరసన
అంగన్వాడీ కార్యకర్తలను అక్రమంగా అరెస్టు చేయడాన్ని ఏఐటీయూసీ పులివెందుల ఏరియా కార్యదర్శి బ్రహ్మం, జిల్లా అధ్యక్షురాలు ప్రభావతి ఖండించారు. మంగళవారం వేంపల్లి 4 రోడ్ల కూడలి వద్ద నిరసన తెలిపారు. అధికారులు, పోలీసులు అంగన్వాడీ కేంద్రాల్లో కార్యకర్తల చేత గోరుముద్దలు తిన్నవారేనని, అటువంటి వారిపై ప్రభుత్వం, పోలీసులు దుర్మార్గంగా వ్యవహరించడం సమంజసం కాదని వారు అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్