పులివెందుల పట్టణంలో శనివారం బీడు భూమిలో ఒక వ్యక్తి మృతదేహం లభ్యమైంది. తెల్ల చొక్కా, పసుపు రంగు పంచె ధరించిన మృతుడిని గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. సాయంత్రం పొలం పనులకు వెళ్లిన రైతు మృతదేహాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.