పులివెందుల: బెదిరించిన ఘటనలో వ్యక్తిపై కేసు నమోదు

8చూసినవారు
పులివెందుల: బెదిరించిన ఘటనలో వ్యక్తిపై కేసు నమోదు
వైఎస్ వివేకా హత్య కేసులో ఏ2 నిందితుడైన సునీల్ యాదవ్ భార్య ధనలక్ష్మి, తమ్ముడు కిరణ్లను బెదిరించిన ఘటనపై పులివెందుల సీఐ సీతారామరెడ్డి ఒకరిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. గురువారం రాత్రి తన వదినను ఆసుపత్రికి తీసుకెళ్తున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తి వైట్ కలర్ బైక్‌పై వచ్చి, 'మీ వదిన, అన్నను చంపితే మీకు దిక్కెవరంటూ' బెదిరించారని కిరణ్ ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్