పులివెందుల మండలం అచ్చివెల్లిలోని ఎస్సీ కాలనీలో సింగిల్ ఫేస్ మోటర్లు కాలిపోవడంతో వారం రోజులుగా తాగునీటికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా స్పందన లేదని కాలనీవాసులు ఆరోపిస్తున్నారు. శనివారం వైసీపీ నాయకుడు జనార్దన్ రెడ్డి దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్లగా, ఆయన తన ట్రాక్టర్ సాయంతో నీటిని సరఫరా చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి మోటార్లను మరమ్మతు చేయాలని ప్రజలు కోరుతున్నారు.