పులివెందుల: హెచ్ఐవీ పరీక్ష తప్పనిసరి

7చూసినవారు
ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా పులివెందులలో వైద్య, ఆరోగ్య సిబ్బంది విద్యార్థులతో కలిసి ఎయిడ్స్ నిర్మూలన ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి రెసిడెన్షియల్ ఆఫీసర్ డాక్టర్ నవీన్, మెడికల్ ఆఫీసర్ శాంత కుమార్ ప్రతి ఒక్కరూ హెచ్ఐవీ పరీక్ష చేయించుకుని సమాచారం తెలుసుకోవాలని సూచించారు. ఎయిడ్స్ అంతం మన పంతమని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్