పులివెందుల ఎస్టీ హాస్టల్ను ఆదివారం ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి పరిశీలించారు. హాస్టల్లో 120 మంది విద్యార్థినులకు కేవలం 2 లీటర్ల పాలు, ఒక గ్లాస్ చక్కెర మాత్రమే అందిస్తున్నారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. మెనూ బోర్డుపై ఉన్న వంటకాలు కాగితం మీదకే పరిమితమయ్యాయని, తాగునీటికి మినరల్ వాటర్ లేక బోర్ వాటర్తోనే ఇబ్బంది పడుతున్నామని తెలిపారు. ఈ సమస్యలను ఎమ్మెల్సీకి వివరించారు.