పులివెందులలో గండికోట ఉత్సవాలను ప్రజల్లో మరింత విస్తృతంగా చేరవేసే లక్ష్యంతో మున్సిపల్ ఛైర్మన్ వర ప్రసాద్ ఆధ్వర్యంలో శనివారం అంబేడ్కర్ సర్కిల్ నుంచి పూల అంగళ్ల సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించారు. గండికోట ఉత్సవాలు జిల్లాకే గర్వకారణమని, ప్రజలందరూ కుటుంబ సమేతంగా పాల్గొని ఈ ఉత్సవాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.