తొండూరులో నిద్ర చేసిన పులివెందుల రూరల్ సీఐ

10చూసినవారు
తొండూరులో నిద్ర చేసిన పులివెందుల రూరల్ సీఐ
తొండూరు మల్లేలలో ఆదివారం రాత్రి జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పులివెందుల రూరల్ సీఐ రమణ, ఎస్ఐ మద్దిలేటి పల్లె నిద్ర చేశారు. ఈ సందర్భంగా సీఐ రమణ మాట్లాడుతూ, గ్రామాలలో శాంతిభద్రతలు కాపాడడంలో ప్రతి ఒక్కరి పాత్ర ఎంతో ముఖ్యమని నొక్కి చెప్పారు. సైబర్ నేరాలు, మహిళల భద్రత, మద్యం-గంజాయి దుర్వినియోగం వంటి అంశాలపై అవగాహన కల్పించారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ఆయన ప్రజలను కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్