పులివెందుల: అచ్చివెళ్లి గ్రామంలో మురుగు నీటి సమస్య

18చూసినవారు
పులివెందుల మండలం అచ్చివెళ్లి సచివాలయం సమీపంలో మురుగునీరు వీధుల్లో నిల్వ ఉండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దుర్వాసన, దోమల పెరుగుదలతో ఆరోగ్య సమస్యలు తలెత్తే పరిస్థితి ఏర్పడిందని గ్రామస్థులు వాపోతున్నారు. పలుమార్లు అధికారులకు సమాచారం ఇచ్చినా చర్యలు తీసుకోలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో డ్రైనేజీ లైన్లను ఏర్పాటు చేయాలని వారు కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్