క్రీడల్లో ప్రతిభ కనబరిచి దేశానికి పేరు తీసుకురావాలని ఎమ్మెల్సీ రామగోపాల్ రెడ్డి క్రీడాకారులను ప్రోత్సహించారు. నేపాల్ లో జరిగిన సౌత్ ఏషియన్ గోల్ షాట్ బాల్ ఛాంపియన్ షిప్ లో భారత జట్టు ప్రథమ స్థానం సాధించింది. ఈ పోటీల్లో జిల్లాకు చెందిన రాచవీటి తేజేంద్ర, తిరుపతి జిల్లాకు చెందిన రెడ్డిచర్ల దేవిప్రియ తమ ప్రతిభను ప్రదర్శించారు. ఆదివారం పులివెందులలోని ఎమ్మెల్సీ నివాసంలో క్రీడాకారులు ఆయనను కలిసి అభినందనలు అందుకున్నారు.