వేములూరులో గురువారం టీడీపీ నాయకుడు రంగారెడ్డి ఆధ్వర్యంలో పలువురు వైసీపీ నాయకులు తెలుగుదేశం పార్టీలో చేరారు. పులివెందులలో టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పేర్ల పార్థసారథి రెడ్డి వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా పనిచేసే టీడీపీ విధానాలు తమను ఆకట్టుకున్నాయని చేరిన నాయకులు పేర్కొన్నారు.