తొండూరు మండలంలోని మల్లెల గ్రామంలోని పాఠశాలకు వెళ్ళే విద్యార్థులు ప్రతిరోజూ మురుగు నీటిలో నడవాల్సిన దుస్థితి నెలకొంది. పాఠశాల దారిలో నీరు నిలిచి ఉండటంతో పిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యను పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్ళినా ఎటువంటి చర్యలు తీసుకోలేదని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని, వెంటనే మురుగు నీటి ప్రవాహాన్ని సరిచేసి, మార్గాన్ని శుభ్రపరచాలని ప్రజలు కోరుతున్నారు.