సింహాద్రిపురం మండలం రావులకొల్లు గ్రామంలోని శ్రీ మారెమ్మ తల్లి ఆలయ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి పూజలు నిర్వహించారు. ప్రత్యేక అలంకరణలో ఉన్న అమ్మవారిని భక్తులు దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. గ్రామ సుభిక్షం కోసం భక్తులు బోనాల కార్యక్రమం నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.