పులివెందుల ప్రాంతంలో కూలీలు అధిక లోడుతో ఆటోల్లో ప్రయాణిస్తూ తమ ప్రాణాలను ప్రమాదంలో పడేసుకుంటున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. వివిధ పనుల నిమిత్తం ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు ఈ ప్రమాదకరమైన ప్రయాణం చేస్తున్నారని, ఏమాత్రం అదుపు తప్పినా తీవ్ర పరిణామాలుంటాయని వారు పేర్కొంటున్నారు. ఈ విషయంలో అధికారులు స్పందించి, అధిక లోడుతో వెళ్లే వాహనాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.