చిత్తూరు జిల్లా వి. కోటకు చెందిన జర్నలిస్టు జగన్మోహన్ రెడ్డి దారుణ హత్యను పులివెందుల జర్నలిస్టుల సంఘాలు తీవ్రంగా ఖండించాయి. ఈ ఘటన జర్నలిస్టుల భద్రతపై తీవ్ర ఆందోళన కలిగిస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం పులివెందుల జర్నలిస్టుల సంఘం నాయకులు స్థానిక డీఎస్పీ మొరళి నాయక్ని కలిసి వినతిపత్రం ఇచ్చారు. నిష్పక్షపాత విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని వారు కోరారు.