పేదల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని
టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి పేర్కొన్నారు. సోమవారం పులివెందుల మున్సిపాలిటీ పరిధిలోని పెద్దకొండప్ప కాలనీ సచివాలయం పరిధిలో భేతెల్ చర్చి లైన్లో
ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం ప్రతి నెలా ఒకటో తేదీన పెన్షన్లను లబ్ధిదారుల ఇంటి వద్దకే చేరవేస్తోందని తెలిపారు.