తొండూరు: చోరి కేసులో ఇద్దరు అరెస్టు

4546చూసినవారు
తొండూరు: చోరి కేసులో ఇద్దరు అరెస్టు
శనివారం తొండూరు పోలీస్ స్టేషన్ లో ఎస్సై ఘన మద్దిలేటి తెలిపిన వివరాల ప్రకారం, జల్సాలకు అలవాటుపడి వరుస దొంగతనాలకు పాల్పడుతున్న హిదయతుల్లా, గైబూలను పోలీసులు అరెస్టు చేశారు. ఇటీవల మల్లేల గ్రామంలోని మసీదులో హుండీని పగలగొట్టి రూ.30 వేల నగదును అపహరించుకెళ్లిన కేసులో వీరిని అదుపులోకి తీసుకున్నారు. దొంగతనం కేసులో ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు ఎస్సై తెలిపారు.

సంబంధిత పోస్ట్