ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ విధానాన్ని కోటి సంతకాలతో అడ్డుకుంటామని, ప్రజా వ్యతిరేక పాలనను ఖండిస్తామని వేంపల్లె జడ్పీటీసీ ఎమ్. రవికుమార్ రెడ్డి అన్నారు. బుధవారం మండల పరిధిలోని బక్కన్నగారిపల్లి గ్రామంలో ప్రతి గడప వద్దకు వెళ్లి ప్రజల నుంచి సంతకాల సేకరణ చేపట్టారు. ప్రజలు కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మెడికల్ కాలేజీల నిర్వహణ బాధ్యత ప్రైవేట్ పరం చేయడానికి వ్యతిరేకిస్తూ సంతకాల ద్వారా తమ అభిప్రాయాన్ని తెలియజేశారు.