సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదమని కాంగ్రెస్ నేత తులసిరెడ్డి అన్నారు. శనివారం వేంపల్లిలో ఆయన మాట్లాడుతూ, అక్రమ వలసదారుల పేరుతో వందలాది మంది భారతీయులను అమెరికా ప్రభుత్వం సైనిక విమానంలో 24 గంటల పాటు పశువుల కంటే హీనంగా రవాణా చేసినప్పుడు ప్రధాని ప్రగల్భాలు ఏమయ్యాయని ప్రశ్నించారు.