వేంపల్లి: మత్తు పదార్థాల నిషేధంపై వివిధ పోటిలు

వేంపల్లి ఆర్కేవ్యాలీ ట్రిపుల్ ఐటీ ఏఓ, ఎన్ఎస్ఎస్ విభాగం అధికారి డా. రవికుమార్, మత్తు పదార్థాల నిషేధంపై విద్యార్థులకు వివిధ రకాల పోటీలు నిర్వహించినట్లు తెలిపారు. శనివారం ప్రత్యేక శిబిరాల ముగింపు సందర్భంగా, ఆయా గ్రామాల్లో డిజిటల్ అవేర్నెస్ వాట్సాప్ ఈ-గవర్నెన్స్ ద్వారా అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ డా. జె. దీప్తి పాల్గొన్నారు.
