ఆర్యవైశ్య అఫిషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ (అవోపా) అధ్యక్షునిగా బైరిశెట్టి సునీల్ కుమార్ మరోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం వేంపల్లిలోని వాసవి కళ్యాణ మండపంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. కార్యవర్గ సభ్యులందరూ ఆయనకు మద్దతు తెలిపారు. మరోసారి అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపిన సునీల్ కుమార్, అవోపా బలోపేతానికి కృషి చేస్తానని, సమిష్టిగా ముందుకు వెళ్తామని తెలిపారు.