నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా, గురువారం పాపాగ్నీ నది ఒడ్డున ఉన్న శ్రీవృషభాచలేశ్వర స్వామి దేవస్థానంలో వేంపల్లె మాజీ ఇంఛార్జీ సర్పంచ్ ఆర్. శ్రీనివాసులు, వైసిపి రాష్ట్ర యువ నాయకుడు ఆర్. వేణుగోపాల్ ఆధ్వర్యంలో భక్తులకు పెద్ద ఎత్తున అన్నదానం ఏర్పాటు చేశారు. ఆలయానికి పోటెత్తిన భక్తులు స్వామి దర్శనం అనంతరం అన్నదానంలో పాల్గొన్నారు.