స్థానిక జడ్పీ ఉర్దూ ఉన్నత పాఠశాలలో మంగళవారం మండల స్థాయి చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్ పోటీలు జరిగాయి. ఈ సందర్భంగా ఎంఇఓ వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ, విద్యార్థులు సైన్స్ పట్ల శాస్త్రీయ దృక్పథంతో మెలగాలని సూచించారు. పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు ఎంఇఓ వెంకట్రామిరెడ్డి, ఉర్దూ పాఠశాల హెచ్ఎం ప్రసాద్, జన విజ్ఞాన వేదిక జిల్లా కార్యదర్శి చెరుకూరి శ్రీనివాసులు, మండల కార్యదర్శి కేశవులు చేతుల మీదుగా మెమోంటోలు అందజేశారు.