వైసీపీ వేముల మండల కన్వీనర్ నాగేళ్ల సాంబశివారెడ్డి మాట్లాడుతూ, వైద్య కళాశాలల ప్రైవేటీకరణతో పేద, మధ్య తరగతి విద్యార్థులు వైద్య విద్యను పొందే అవకాశం కోల్పోతారని అన్నారు. శనివారం నల్లచెరువు పల్లెలో కోటి సంతకాల కార్యక్రమం నిర్వహించారు. జగన్ నాయకత్వంలో 17 మెడికల్ కాలేజీల నిర్మాణం చేపట్టి, ఐదు కాలేజీలను ప్రారంభించామని, అయితే కూటమి ప్రభుత్వం మిగతా కాలేజీలను ప్రైవేటీకరించాలనే నిర్ణయాన్ని వైసీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని ఆయన తెలిపారు.