ఉపాధి పనిచేస్తూ కుప్పకూలిన మహిళ

4చూసినవారు
సోమవారం, వేముల మండలం గొల్లలగూడూరు గ్రామ సమీపంలో ఉపాధి హామీ పనుల వద్ద సుకన్య (54) అనే మహిళ అకస్మాత్తుగా అస్వస్థతకు గురైంది. పని చేస్తున్న సమయంలో కళ్లు తిరిగి పడిపోవడంతో తోటి కూలీలు వెంటనే 108కు సమాచారం అందించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని కూలీలు తెలిపారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో కలకలం రేగింది.