ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి కుమార్తె వివాహ రిసెప్షన్ ఈ నెల 5న జరగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ సీఎం వైఎస్ జగన్ గురువారం ప్రొద్దుటూరు రానున్నారు. ఆయన బెంగళూరు నుంచి బయలుదేరి పొద్దుటూరు వస్తున్నారు. జగన్ పీఏ నాగేశ్వరరెడ్డి జగన్ ప్రొద్దుటూరు పర్యటన వివరాలను అధికారికంగా విడుదల చేశారు. జగన్ ఉదయం 11 నుంచి 12 గంటల వరకు మాత్రమే ఇక్కడ ఉంటారు.