మదనపల్లె కర్ణాటక సరిహద్దు, రాయల్పాడు వద్ద గురువారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.ఆంధ్రకు బైకులో కర్ణాటక మద్యం తెస్తున్న యువకుడు దుర్మరణం చెందాడు. రాయల్పాడు ఎస్ఐ కథనం మేరకు.. ఏపీ39 ఎఫ్ యూ1825 నెంబరు గల బైకులో కర్ణాటక మద్యం తీసుకుని ఆంధ్రకు వస్తున్న యువకుడ్ని మదనపల్లెకు చెందిన ప్రయివేట్ బస్సు ఢీకొనగా గుర్తు తెలియని యువకుడు అక్కడి కక్కడే దుర్మరణం చెందాడు. ప్రమాదంలో మృతుని తల,మొండెం వేరుఅయ్యాయి.