అన్నమయ్య జిల్లా కేంద్రంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ నాయకులు పుల్లంపేట మండలం బైపాస్ వద్ద నిర్వహించిన బందు, రాస్తారోకకు సంబంధించి కేసులు నమోదు చేశారు. ఈ మేరకు 23-12-2025న పుల్లంపేట ఎస్సై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయగా శుక్రవారం కాంగ్రెస్ నేతలు పుల్లంపేట పోలీస్ స్టేషన్‌కు హాజరై సంతకాలు చేసి కేసు వివరాలను కోర్టుకు సమర్పించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఎస్సీ సెల్ కన్వీనర్ శాంతయ్య, కోడూరు ఇన్‌చార్జి దేవి, పుల్లంపేట మండల అధ్యక్షుడు రమేష్ మాట్లాడుతూ, హక్కుల కోసం చేసిన పోరాటంపై కేసులు పెట్టడం దుర్మార్గమని విమర్శించారు.