పుల్లంపేట చెరువు పనులపై కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

2439చూసినవారు
అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ గురువారం పుల్లంపేట చెరువు, ఆనకట్టలు, కాలువ పనులను ఆకస్మికంగా పరిశీలించారు. అప్పారాజుపేట ఆనకట్ట నుంచి పుల్లంపేట చెరువుకు వచ్చే 4 కిలోమీటర్ల కాలువలో పూడిక తొలగింపుపై ఏఈఈ నాగేంద్ర నాయక్ కలెక్టర్‌కు వివరించారు. వాగులు, రోడ్డు క్రాస్ స్ట్రక్చర్స్‌పై నివేదిక ఇవ్వాలని, తక్కువ ఖర్చుతో చెరువులకు నీరు వచ్చే మార్గాలను పునరుద్ధరించాలని కలెక్టర్ ఆదేశించారు. గొలుసుకట్టు చెరువులకు పుల్లంగేరు నీరు చేరుతుందని ఏఈఈ తెలిపారు.

సంబంధిత పోస్ట్