చిట్వేల్ మండల హరిజనవాడ గ్రామానికి చెందిన సుబ్రహ్మణ్యానికి రూ. 14 వేల సీఎం సహాయ నిధి చెక్కును శుక్రవారం ఎమ్మెల్యే అరవ శ్రీధర్, ముక్కా వరలక్ష్మి అందజేశారు. ప్రజల అశ్రయంగా ప్రభుత్వం నిలవడం కూటమి పాలన లక్ష్యమని, సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా కుటుంబాలకు అండగా నిలుస్తుందని ఎమ్మెల్యే అరవ శ్రీధర్ అన్నారు. ఈ సహాయం జీవనానికి కొత్త శక్తినిస్తుందని ముక్కా వరలక్ష్మి తెలిపారు.