రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు, చిట్వేల్ మండలంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో రేపు శుక్రవారం 'మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ 3.0' (ఎంపీటీఎం 3.0) తప్పనిసరిగా నిర్వహించాలని మండల విద్యాశాఖ అధికారులు ఖాజా మొహిద్దీన్, ఈశ్వరయ్య స్పష్టం చేశారు. ప్రభుత్వం నిర్దేశించిన షెడ్యూల్, నిబంధనలకు అనుగుణంగా సమావేశాలు జరిగేలా ప్రధానోపాధ్యాయులు, యాజమాన్యాలు పర్యవేక్షించాలని ఆదేశించారు. విద్యార్థుల పురోగతి, సమస్యలు, సూచనలు, పాఠశాల అభివృద్ధిలో తల్లిదండ్రుల భాగస్వామ్యం పెంచడం ఈ కార్యక్రమ లక్ష్యం. ఈ మెగా సమావేశం విజయవంతం కావడానికి పకడ్బందీ చర్యలు తీసుకోవాలని అధికారులు ఉద్ఘాటించారు.