తిప్పాయపల్లిలో ఘనంగా మగవారి పొంగళ్ల పండుగ ప్రారంభం

6చూసినవారు
తిప్పాయపల్లిలో ఘనంగా మగవారి పొంగళ్ల పండుగ ప్రారంభం
తిరుపతి జిల్లా పుల్లంపేట మండలం తిప్పాయపల్లిలో శ్రీ సంజీవరాయ స్వామి ఆలయంలో మగవారి పొంగళ్ల పండుగ ఘనంగా ప్రారంభమైంది. ఈ ఆలయ ప్రత్యేకత ఏమిటంటే, మగవారే పూజలు నిర్వహించి పొంగళ్ళు పెడతారు, మహిళలకు ఆలయ ప్రవేశం ఉండదు. ప్రతి సంవత్సరం సంక్రాంతికి ముందు వచ్చే ఆదివారం ఈ పండుగను వైభవంగా నిర్వహిస్తారు. ఈ ఏడాది కూడా దేశ విదేశాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్