చిట్వేలు మండలంలోని పెద్దూరు గ్రామానికి 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న అడవిలోని శ్రీ కర్కాటేశ్వర స్వామి గుండాలకోనలో దైవదర్శనానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని ఆలయ కమిటీ ఛైర్మన్ బుంగటావుల రాజశేఖర్ నాయుడు సోమవారం తెలిపారు. పోలీసు, వైద్య, రెవెన్యూ శాఖల సమన్వయంతో భక్తుల రక్షణ, శాంతిభద్రతల కోసం ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. వర్షం లేకపోవడంతో ఈసారి భారీగా భక్తులు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.