
నగ్నంగా మహిళ పూజలు.. చితకబాదిన గ్రామస్తులు(వీడియో)
ఉత్తరప్రదేశ్‌లోని మహారాజ్‌గంజ్ జిల్లాలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఒక మహిళ శ్మశాన వాటికలో రాత్రి సమయంలో నగ్నంగా తాంత్రిక పూజలు చేస్తూ స్థానికులకు కనిపించింది. దీంతో గ్రామస్తులు ఆ మహిళను పట్టుకుని చితకబాదారు. ఇందుకు సంబంధించిన సంఘటనను తమ మొబైల్ ఫోన్లలో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. సదరు మహిళను కొడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు స్పందించి, ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.




