పుల్లంపేట మండలం రెడ్డిపల్లి హరిజనవాడకు చెందిన ఉపాధి హామీ కూలీ తుమ్మలూరు లక్ష్మీనరసింహ (60) గురువారం ఉదయం రెడ్డిపల్లి చెరువు కట్ట వద్ద కడప-తిరుపతి జాతీయ రహదారి దాటుతుండగా, రైల్వే కోడూరు నుండి కడప వైపు వెళ్తున్న లారీ ఢీకొని అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.