రైల్వే కోడూరు: హోలీ లో తెలియని వ్యక్తులపై రంగులు చల్లవద్దు

57చూసినవారు
రైల్వే కోడూరు: హోలీ లో తెలియని వ్యక్తులపై రంగులు చల్లవద్దు
హోలీ పండుగ రోజు మీకు తెలియని వ్యక్తులపై రంగులు చల్లొద్దని రైల్వే కోడూరు గ్రామీణ పోలీసు సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు సూచించారు. గురువారం రైల్వే కోడూరు పోలీస్ స్టేషన్ లో ఆయన మాట్లాడుతూ హోలీ పండుగలో సాంప్రదాయ రంగులు చల్లుకోవాలని, మందులు కలిపిన రంగులు చల్లుకోవద్దని ఆయన అన్నారు. మోటార్ బైకులపై గుంపులు గుంపులుగా తిరుగుతూ దారిన పోయే వారిపై రంగులు చల్లితే చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్