
నితీశ్‌కు అవకాశాలిస్తే మెరుగుపడతాడు: అశ్విన్
దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో నితీశ్ కుమార్ రెడ్డికి తుది జట్టులో చోటు దక్కకపోవడంపై మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ జట్టు ఎంపికపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. హార్దిక్ పాండ్య అందుబాటులో లేని సమయంలో నితీశ్‌ను ఎంపిక చేసి, తుది జట్టులో ఎందుకు తీసుకోలేదని ఆయన ప్రశ్నించారు. జట్టు కూర్పులో ఏదో తప్పు జరుగుతోందని, నితీశ్‌కు అవకాశాలిస్తే మెరుగుపడతాడని అన్నారు. కాగా భారత్, సౌతాఫ్రికా మధ్య డిసెంబర్ 3న రాయ్‌పూర్‌లో రెండో వన్డే జరగనుంది.




