గ్రామస్తుల భక్తిశ్రద్ధలతో గంగమ్మ తల్లికి చల్ల పోత

1842చూసినవారు
అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు మండలంలోని అయ్యవారిపల్లి గ్రామంలో గ్రామస్తులందరూ కలిసి శ్రీ శ్రీ గంగమ్మ తల్లికి భక్తిశ్రద్ధలతో చల్ల పోసుకున్నారు. గ్రామ పెద్ద రాజీపోయిన రాజయ్య మాట్లాడుతూ, గ్రామం చల్లగా ఉండాలని, గంగమ్మ తల్లి ఆశీస్సులు ఉండాలని ఈ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. ప్రతి ఇంటి నుండి తెచ్చిన చల్ల గంగమ్మకు సమర్పించారు. ఈ కార్యక్రమంలో అడివి నరసింహులు, గ్రామ ప్రజలు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

ట్యాగ్స్ :